పాట్నాలో రోడ్డు ప్రమాదం
ఏడుగురి మృతి మెట్రో క్రేన్ ను ఢీ కొన్న ఆటో
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో కోసం పనిచేస్తున్న క్రేన్ ను ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రాదం చోటు చేసుకుంది. ఆటోలో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రమాదం కంకర్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ బైపాస్ లో జరిగింది. ఈ ఘటనపై ట్రాఫిక్ డీఎస్పీ మాట్లాడుతూ.. మిఠాపూర్ నుంచి జీరోమైల్ వైపు ఆటో వెళ్తోందని, అందులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. మరోవైపు మిఠాపూర్ సమీపంలో మెట్రో పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆటో మెట్రో క్రేన్‌ను బలంగా ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ మహిళ, చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారని పోలీసులు వివరించారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. అందరూ నేపాల్, రోహ్తా, ముజఫర్‌పూర్, మధుబని, వైశాలి నివాసితులని పోలీసులు వివరించారు. వీరంతా బస్సు ఎక్కేందుకు బైరియా బస్టాండ్‌కు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.