లండన్​ పార్లమెంట్​ లో ఘనంగా మహావీరుడి జయంతి

ఆచార్య లోకేష్​ మునికి యూఎస్​ ప్రెసిడెంట్ గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డు భారత సంస్కృతిని కొనియాడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​

Apr 16, 2024 - 14:52
 0
లండన్​ పార్లమెంట్​ లో ఘనంగా మహావీరుడి జయంతి

లండన్​: లండన్​ పార్లమెంట్​ లో మహావీర్​ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైన సన్యాసి ఆచార్య లోకేష్​ ముని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య లోకేష్​ మాట్లాడుతూ..భగవాన్ మహావీరుడి తత్వశాస్త్రం మానవాళి మనుగడకు ఎన్నో నీతి వ్యాఖ్యలను బోధిస్తుందన్నారు. ఇది చాలా ముఖ్యమైందని అన్నారు. ఈ శాస్ర్తం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. 
ఈ వేడుకల్లో ఫెడరేషన్‌ ఆఫ్‌ జైన్‌ అసోసియేషన్‌ ఇన్‌ నార్త్‌ అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రేమ్‌ జైన్‌, డైరెక్టర్‌ బీరేన్‌ షా, ఇతర నేతలు పాల్గొన్నారు. ఆచార్య లోకేష్​ ను ఈ సందర్భంగా యూఎస్​ ప్రెసిడెంట్ గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డుతో సత్కరించారు. 

అమెరికా అధ్యక్షుడి అభినందన.. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఆచార్య లోకేష్ మునిని అభినందించారు. మానవతావాది, నిరంతరం సమాజ సేవకై తపిస్తారన్నారు. సమాజాన్ని సన్మార్గంలో పెట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ గౌరవం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు, భగవంతుడు మహావీర్ సూత్రాలకు గౌరవమని జో బైడెన్​ తెలిపారు.