ఘనంగా ముగిసిన నిమజ్జనాలు
అధికార యంత్రాంగానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు
నా తెలంగాణ, మైనంపల్లి: మెదక్ పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు భక్తి, శాంతియుతంగా పూర్తవడం పట్ల జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్, రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ నాయకులులు హన్మంత్ రావులు సంతోషం వ్య్తం చేశారు. గురువారం కార్యక్రమాలపై విలేఖరులకు వివరాలందించారు. నిమజ్జన ఏర్పాట్లు పకబ్భందీగా నిర్వహించిన అధికార యంత్రాంగానికి, మండప నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. విలేఖరుల సమావేశంలో మైనంపల్లి రోహిత్ వెంట మున్సిపల్ చైర్మెన్ చంద్రపాల్, కౌన్సిలర్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.