మోదీ అధికారం సమసిన అల్లర్లు
ఎన్డీయేను వీడి వెళ్లేది లేదు ఎన్నికల సభలో సీఎం నితీశ్ కుమార్
పాట్నా: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నారు కాబట్టే అల్లర్లు పూర్తిగా సమసిపోయాయని పొరపాటున కూడా ప్రతిపక్షాలకు ఓటేస్తే తిరిగి అల్లర్లు మొదలవుతాయని బిహార్ సీఎం నితీశ్‌కుమార్ అన్నారు. తానిక ఎన్డీయేను వదిలి వెళ్లేది లేదన్నారు. చివరి వరకు ఎన్డీయేతోనే ఉంటానని స్పష్టం చేశారు. గురువారం జముయిలో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మోదీ వెంట నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి నితీశ్ప్రసంగించారు. కర్పూరీ ఠాకూర్‌కి భారతరత్న ప్రదానాన్ని బీహార్ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్జేడీ పాలనలో ఇళ్ల నుంచి బయటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవన్న సంగతిని ప్రతీఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని ఎన్డీయే దేశ, రాష్ర్ట అభివృద్ధికి కట్టుబడి ఉన్నాయని నితీశ్ స్పష్టం చేశారు.