ఇరాన్‌పై ఉగ్రదాడి 27మంది మృతి
ఇరాన్లో భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 27మందికిపైగా మృతిచెందినట్లు స్థానిక వార్తా కథనాలు ప్రసారమయ్యాయి.
టెహ్రాన్: ఇరాన్లో భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 27మందికిపైగా మృతిచెందినట్లు స్థానిక వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. ఆ కథనాల ప్రకారం ఇరాన్‌లోని చబహార్, రస్క్ నగరాల్లో బుధవారం అర్థరాత్రి ఇరాన్ బోర్డర్ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై ‘జైష్ -అల్- అద్ల్’ గ్రూప్‌నకు చెందిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 11మంది భద్రతా సిబ్బంది, 16 మంది పౌరులు మృతిచెందారు. ఉగ్రదాడిపై మంత్రి మజిద్ మాట్లాడుతూ.. బోర్డర్ గార్డ్స్కార్యాలయాన్ని ఉగ్రవాదులు స్వాధీనం చేసుకుందామని వ్యూహారచన చేశారన్నారు. దాడి జరిగిన వెంటనే ప్రతిదాడులకు దిగామని తెలిపారు. ఈ దాడుల్లో 15 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు మంత్రి తెలిపారు. దాడి సందర్భంగా స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తం కాగా, కొన్ని కిలోమీటర్ల వరకూ దట్టంగా పొగలు అలుముకున్నాయి.