జౌన్​ పూర్​ అటలా మసీదు హిందు దేవాలయమే కోర్టులో పిటిషన్​ దాఖలు

చారిత్రక ఆధారాలున్నాయన్న న్యాయవాది అజయ్​ ప్రతాప్​ సింగ్​ ఆలయాన్ని కూల్చివేయాలని ఫిరోజ్​ షా ఆదేశాలు ఇబ్రహీం షా ఆక్రమించుకున్నట్లు ఆధారాలు

May 18, 2024 - 15:07
 0
జౌన్​ పూర్​ అటలా మసీదు హిందు దేవాలయమే కోర్టులో పిటిషన్​ దాఖలు

లక్నో: యూపీలోని మసీదును అతల మాత దేవాలయంగా అభివర్ణిస్తూ జౌన్‌పూర్ కోర్టులో శనివారం పిటిషన్​ దాఖలైంది. జౌన్‌పూర్ మసీదులో ఆలయానికి సంబంధించిన అనేక చిహ్నాలు ఉన్నాయని హిందూ పక్షం పేర్కొంది. త్రిశూలం, పూలు తదితర చిత్రాలు ఇందులో ఉన్నాయని చెప్పారు. దీంతో పాటు పురావస్తు శాఖ డైరెక్టర్ నివేదిక, వివిధ పుస్తకాలను కూడా ఉన్నట్లుగా పిటిషన్​ లో పేర్కొన్నారు.

గతేడాది మసీదును మాతా దేవాలయంగా జిల్లాకు చెందిన హిందూ సమాజానికి చెందిన వారు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త కోర్టుకు చేరడంలో హాట్​ టాపిక్​ గా మారింది. ఆగ్రా న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్, ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, మేనేజ్‌మెంట్ కమిటీ అటాలా మసీదుపై దావా వేశారు. న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, సూట్ ప్రాపర్టీ అటాలా మసీదు ప్రాథమికంగా అటాలా మాత దేవాలయం. చారిత్రక ఆధారాల ప్రకారం, కన్నౌజ్ రాజు జయచంద్ర రాథోడ్ అటాలా మాత ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. 

అతల మాత ఆలయాన్ని కూల్చివేయాలని ఫిరోజ్ షా ఆదేశించారని భారత పురావస్తు శాఖ తొలి డైరెక్టర్ తన నివేదికలో రాశారని న్యాయవాది అజయ్ ప్రతాప్ స్పష్టం చేశారు. కానీ హిందువుల పోరాటం వల్ల ఆలయాన్ని కూల్చలేకపోయారన్నారు. తర్వాత ఇబ్రహీం షా ఆక్రమించుకుని ఆలయాన్ని మసీదుగా ఉపయోగించాడని ఆధారాలున్నట్లుగా పేర్కొన్నారు. కాగా కలకత్తా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ప్రిన్సిపాల్ ఇబి హావెల్ తన పుస్తకంలో అటాలా మసీదును హిందువు దేవాలయంగా అభివర్ణించడం గమనార్హం.