కోల్ కత్తా నిందితులను ఉరి తీయాలి
మా ప్రాణాలకే రక్షణ లేకుంటే రోగుల ప్రాణాలు ఎలా కాపాడగలం షాద్ నగర్ పట్టణంలో డాక్టర్ల భారీ ర్యాలీ
నా తెలంగాణ, షాద్ నగర్: కోల్‌కత్తా ఘటనలో జూనియర్ వైద్యురాలిని అత్యంత పాశవికంగా చంపిన నరరూప హంతకులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ షాద్ నగర్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాస్పిటల్స్ లో వైద్య సేవలు నిలిపివేసి వైద్యులు, వైద్య సిబ్బంది శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ అనంతరం ముఖ్య కూడలిలో బైఠాయించి న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. కోల్ కత్తా నిందితులను వెంటనే ఉరి తీయాలని లేదా దిశ ఘటనలో చేసినట్టుగా ఎన్ కౌంటర్ చేయాలన్నారు. వైద్యులను దేవుళ్లుగా చూసే మన దేశంలో అత్యాచారాలు జరగడం దారుణమన్నారు. వైద్యుల ప్రాణాలకే రక్షణ లేకుంటే రోగుల ప్రాణాలు ఎలా కాపాడగలం అని ప్రశ్నించారు. హేయమైన చర్యకు పాల్పడ్డ నిందితులను వెంటనే ఉరి తీయకుంటే ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.