ఎన్నికల్లో పోటీ చేయను ప్రజాసేవకే అంకితం మాజీ స్పీకర్ మీరాకుమార్
ఎంపీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రజాసేవకే అంకితమవుతానని లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ సామాజి మాధ్యమం ద్వారా శనివారం స్పష్టం చేశారు.
పాట్నా: ఎంపీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రజాసేవకే అంకితమవుతానని లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ సామాజిక మాధ్యమం ద్వారా శనివారం స్పష్టం చేశారు. బీహార్‌కు చెందిన మీరా కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు. ఎల్లప్పుడూ నా దేశ ప్రజలకు, ముఖ్యంగా పేదలు, అణగారిన వ్యక్తులు, మహిళలకు సేవ చేస్తానన్నారు. మీరా కుమార్ ప్రముఖ దళిత నాయకుడు, మాజీ రక్షణ మంత్రి జగ్జీవన్ రామ్ కుమార్తె. ఆమె ఫారిన్ సర్వీస్ అధికారిగా కూడా పనిచేశారు. మీరా కుమార్ 15వ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. దేశానికి తొలి మహిళా స్పీకర్‌గా గుర్తింపు పొందారు. 1985లో బిజ్నోర్ లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో మాయావతి, రామ్ విలాస్ పాశ్వాన్ లను ఓడించి తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టిన మీరా కుమార్.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బిజ్నూర్ నుంచి ఓడిపోయారు. ఢిల్లీలోని కరోల్ బ్యాగ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలిచి మళ్లీ పార్లమెంటుకు చేరుకుంది. ఆ తర్వాత ఆమె ససారం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మీరా కుమార్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలు కూడా.