నేపాల్​ లో మూడు పెట్రోలియం ప్రాజెక్టులు

వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి హర్దీప్​ సింగ్​ పూరీ

Aug 10, 2024 - 17:00
 0
నేపాల్​ లో మూడు పెట్రోలియం ప్రాజెక్టులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత సహకారంతో నేపాల్​ లోని మూడు ప్రధాన పెట్రోలియం ప్రాజెక్టులను నిర్మించనున్నారు. ఆగస్ట్​ 6 నుంచి 8వ తేదీ వరకు జరిగిన బిమ్స్‌టెక్ ట్రేడ్ సమ్మిట్ లో పాల్గొని తిరిగి భారత్​ కు వచ్చిన మంత్రి భండారీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం ఉదయం న్యూఢిల్లీలో పెట్రోలియం, సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో సమావేశమయ్యారు.

అనంతరం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా హర్దీప్​ సింగ్​ పూరీ మాట్లాడుతూ..ప్రాజెక్టులను సబ్సిడీతో నిర్మించేందుకు భారత్​ అంగీకారం తెలిపిందన్నారు. ఇరువురు దేశాల మంత్రివర్గ స్థాయి సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. త్వరలో ఈ నిర్మాణాలపై ఇరుదేశాల సంయుక్త కార్యదర్శుల సమావేశం జరగనుందని తెలిపారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణాలపై మరింత స్పష్టత రానుందని వెల్లడించారు. 

కాగా గతేడాది న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో అప్పటి ప్రధాని పుష్పకమల్ దహల్ 'ప్రచండ' భేటీలో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదిరింది. రెండు దేశాల చమురు కంపెనీలు ఆరు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఒప్పందం నిర్దేశించుకున్నాయి.