2026లో ఎంకె–2 ఫైటర్​ జెట్​ 

Mk-2 fighter jet in 2026

Aug 10, 2024 - 15:54
 0
2026లో ఎంకె–2 ఫైటర్​ జెట్​ 

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: డీఆర్డీవో రూపొందిస్తున్న ఎంకె–2 (ఫైటర్​ జెట్​) స్వదేశీ లై కంబాట్​ ఎయిర్​ క్రాఫ్ట్​ (ఎల్​సీఏ) 2026లో తొలి ఫైట్​ అందుబాటులోకి తీసుకురానున్నారు. శనివారం వైమానిక దళానికి చెందిన పీఎస్​యూ, సెమిలాక, ఎన్​ఎఫ్టీసీ సీనియర్​ అధికారులు ఈ విమానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలన్న ఉదేశ్యంతో సమావేశం నిర్వహించారు.

ఎల్​ సీఏ ఎంకె–2: హెచ్​ సీఎల్​ ద్వారా ఈ ఫైటర్​ జెట్​ ఉత్పత్తి ప్రారంభించున్నారు. ఈ ఫైటర్​ జెట్​ లో 13 రకాల ఆయుధాలను ఉంచే సామర్థ్యాన్ని కల్పించనున్నారు. దీని బరువు 17,500 కిలోలు ఉండగా, పొడవు 47.11, ఎత్తు 15.11, రెక్కలు 27.11 అడుగుల పొడవు ఉండనున్నాయి. 6500కేజీల బరువు ఆయుధాలతో ఎగిరేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. దీని వేగం గంటకు 2,385కి.మీ. 2500కి.మీ. పరిధిలోని లక్ష్యాలను చేధించగలదు. 56,758అడుగుల ఎత్తులో ఎగరగలదు.