సనాతన ధర్మాన్ని రక్షిద్దాం

మహా ప్రచారంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​ 

Nov 16, 2024 - 15:38
 0
సనాతన ధర్మాన్ని రక్షిద్దాం

ముంబాయి: సనాతన ధర్మాన్ని రక్షించేందుకే ఎన్డీయే శివసేన (షిండే), జనసేనలు ఆవిర్భవించాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​ అన్నారు. ధైర్యంగా నిలబడే భారత్​ నే బాలాసాహెబ్​ కోరుకున్నాని తెలిపారు. శనివారం మహారాష్ట్రలోని డెగ్లూర్​ సభలో ఎన్డీయేకు మద్ధతుగా శివసేన అభ్యర్థికి తరఫున  ప్రచారం కొనసాగించారు. శివాజీ మహారాజ్​ గడ్డపై అడుగిడడం తెలుగు వాడిగా సంతోషాన్నిచ్చిందన్నారు. కాసేపు మరాఠీలో మాట్లాడి సభికులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. జాతీయ భావం, ప్రాంతీయ తత్వాన్ని రక్షించడమే తమ పార్టీల సిద్ధాంతం అని పవన్​ అన్నారు. బాల్​ ఠాక్రే  జీవితం నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ఠాక్రే కలలు గన్న అయోధ్య రామమందిర నిర్మాణ కలను నిజం చేసి చూపించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ప్రశంసలు కురిపించారు. 

భారతదేశ స్వాతంత్ర్యాన్ని అత్యంత కష్టపడి ఐక్యతగా సాధించుకున్నామన్నారు. వీడిపోయి బలహీనపడాలా? కలిసి బలంగా నిలబడాలా? అనేది ప్రతీఒక్కరూ ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మన అస్థిత్వానికి ప్రమాదకరంగా మారే వారికి స్థానం కల్పిద్దామా? అభివృద్ధి వైపు పయనిద్దామా?అని నిర్ణయించుకోవాలన్నారు. సాయంత్రం భోకర్​ నియోజకవర్గంలో సభలో పాల్గొననున్నారు. 17వ తేదీ ఆదివారం లాతూర్​, షోలాపూర్​, విదర్భ  చంద్రపూర్​ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలు, రోడ్​ షోలో పాల్గొంటారు.