పటాన్​ చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

ED searches Patan Cheru MLA's house

Jun 20, 2024 - 14:20
 0
పటాన్​ చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

నా తెలంగాణ, హైదరాబాద్​: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఇడి సోదాలు చేపట్టింది. పటాన్ చెరు పట్టణంలో‌ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధు, వారి బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో ఇడి సోదాలు నిర్వహించింది. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎమ్మెల్యే ఇంటికి ఇడి అధికారులు చేరుకొని సోదాలు చేపట్టారు. మైనింగ్​ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడినట్లు గూడెంపై ఆరోపణలున్నాయి. అక్రమ మైనింగ్ ద్వారా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు చేపట్టింది. లక్డారం గనుల వ్యవహారంలో సోదాలు కొనసాగినట్లు తెలుస్తోంది.