తెలంగాణ తలమానికం ఫణిగిరి
పురావస్తుశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ తవ్వకాల్లో బయటపడ్డ ఇక్ష్వాకుల కాలం నాటి నాణాలు మ్యూజియం ఏర్పాటు.. సందర్శిస్తున్న ప్రముఖులు ఇక్కడి నుంచే పరిశోధనకు వీక్షణం
నా తెలంగాణ, హైదరాబాద్: ప్రపంచపటంలో ఫణిగిరి బౌద్ధ క్షేత్రం తెలంగాణకే తలమానికమని ఇక్కడ దొరికే ఆధారాలు ప్రపంచవ్యాప్తంగా చరిత్ర పరిశోధనకు దారి చూపుతున్నాయని పురావస్తుశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ అన్నారు. నాలుగు రోజుల కిందట సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో చనిపోయిన తవ్వకాల్లో 2 వేల ఏళ్ల కిందటి సీసపు నాణేలు బయటపడ్డాయి. వీటిని పరిశీలించి వివరాలు తెలుసుకునేందుకు శైలజా రామయ్యర్ గురువారం ఫణిగిరి క్షేత్రానికి చేరుకొని నాణేలను పరిశీలించి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఫణిగిరిలో కొందరి సహాయంతో నూతనంగా ఈ నెల 11న బౌద్ధ మ్యూజియాన్ని ఏర్పాటు చేసుకోగలిగామని అందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మ్యూజియం నిర్మాణం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు లభించిన చరిత్రాక వస్తువులు, నాణేలు, ఆధారాలను ఇక్కడే భద్రపరుచుకునే వెసులుబాటు ఉంది. ఈ ఆధారాలను ఇక్కడి నుంచే దేశం, విదేశాల్లోని ప్రముఖ నిపుణులకు అధ్యయనం కోసం వీక్షించే ఏర్పాట్లను కూడా చేయగలిగామని రామయ్యర్ వివరించారు. దీని ద్వారా ఫణిగిరి క్షేత్రం ప్రాధాన్యత, చరిత్ర బయటకు వస్తుంది. ఇది తెలంగాణ కీర్తి, ప్రతిష్ఠలను పెంచడానికి. లభించిన నాణేలు ఇక్ష్వాకుల కాలం నాటి నాణాలుగా గుర్తించినట్లు చెప్పారు. క్రీ.శ. 2-4 శతాబ్దానికి చెందినవిగా వివరించారు. వీటిని వెలికితీయడంలో ఆర్కియాలజీ సిబ్బంది శ్రమ వెలకట్టలేనిదని ప్రశంసించారు. మన చారిత్రక సంపదను న్యూయార్క్, దేశంతోపాటు దేశ, విదేశాల్లో ప్రదర్శించిన గుర్తు చేశారు. ఫణిగిరిలో బౌద్ధ చరిత్ర వికసిల్లిందనే దానికి లభిస్తున్న ఆధారాలు ఊతం ఇస్తున్నాయని శైలజా రామయ్యర్ పేర్కొన్నారు.
ఆధారాలకు చాలా ప్రాముఖ్యత: భారతీ హోళీకేరీ
ఫణిగిరి బౌద్ధ క్షేత్రానికి తెలంగాణలో చాలా ప్రాముఖ్యత ఉందని పురావస్తు శాఖ డైరెక్టర్ భారతీ హోళీకేరీ అన్నారు. ఇక్కడ చుట్టూపక్కల అనేక చారిత్రక ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇక్ష్వాకుల కాలం నాటి నుంచి శాతవాహనుల కాలం వరకు పలు ఆధారాలు లభ్యమవుతుండడం గొప్ప విషయం. అమరావతి, నేలకొండపల్లి తిరుమలగిరి, నాగారం తదితర ప్రాంతాలు ఎక్కువగా లభ్యం కావడం విశేషమని భారతీ హోలికేరి తెలిపారు.
గతంలో..
బౌద్ధక్షేత్రంలో 11 ఏళ్ల ఇక్ష్వాకులు కూడా పాలించినట్లు ఇక్కడ లభించిన పలు ఆధారాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. 1941లో అప్పటి నిజాం కాలంలో ఈ క్షేత్రంలో తొలిసారి తవ్వకాలు జరిపారని అధికారులు వివరించారు. ఆ తర్వాత రాష్ట్ర పురావస్తు శాఖ 2001 నుంచి 2007 వరకు 2015లోనూ ఒకసారి ఫణిగిరి గుట్టపై మరోసారి తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో మహాస్థూపం, చైతన్య గుహలు, స్థూపాలు, గృహాలు, శిలా మండపాలు, బుద్ధుడి పాదాలు, బుద్ధుడి ప్రతిమలు, పాత్రలు, చిహ్నాలు, జాతక కథలు, సిద్ధార్థ గౌతమి జీవిత కథలు, అపురూపంగా మల్చిన శిల్పాలు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, మహాతరవరుల నాణాలు, బొమ్మలు బయటపడ్డాయి. కుండలు, కూజాలు, కప్పులు, టైల్స్, బౌద్ధుల గదులు బయటపడ్డాయి. ఇందులో 32 గదులు ఉన్నాయి. బుద్ధుడి పాదాలు, బుద్ధుడి వ్యక్తిత్వానికి ప్రతీకలుగా భావించే అష్టమంగళం చిహ్నాలు, మర్మచక్రం, మిథునం, అంకుశం, యజ్ఞాశం, ఖడ్గం, సప్తి, పిరస్నం గుర్తులు లభిస్తాయి. ప్రపంచంలో ఎక్కడా లేని బుద్ధుడి తలపాగా ఇక్కడ లభ్యమైందని చెబుతారు. గతంలో ఇక్కడ బుద్ధవనం ప్రాజెక్ట్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. తరచుగా దేశ, విదేశీ బౌద్ధ మత గురువులు, పురావస్తు పరిశోధకులు, అధ్యయనకారులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు.
మార్చి 29న లభించిన ఆధారాలు..
2 వేల ఏళ్ల కిందటి సీసపు నాణాలు ఫణిగిరి తవ్వకాల్లో బయటపడ్డాయి. విగ్రహాలకు సంబంధించిన రాతి ముక్కలు, సీసపు గాజు పెంకులు, మట్టికుండ వంటివి లభ్యమయ్యాయి. 2023-24 మార్చి 11న ప్రారంభమైన తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలంనాటి మట్టి పాత్రలో 3730 సీసపు నాణాలు, రాతి పూసలు, సున్నపు రాతి విగ్రహాలు లభించాయి. భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ దొరకని 3730 నాణాలు ఇక్కడ లభించాయి. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, పురావస్తుశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, డైరెక్టర్ భారతీ హోళీకేరీ, కలెక్టర్ వెంకటరావు చేపట్టారు.