స్వయం సహాయక సభ్యులకు ధృవపత్రాల పంపిణీ

Distribution of certificates to self help members

Oct 3, 2024 - 18:15
 0
స్వయం సహాయక సభ్యులకు ధృవపత్రాల పంపిణీ

నా తెలంగాణ, మెదక్​: గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ-క్రైమ్ అండ్ బ్యూరో మేనేజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ జమీల్ ఖాన్ గురువారం మెదక్  పట్టణంలోని స్వయం సహాయక సంఘం సభ్యులకు పతకాలు, సర్టిఫికేట్‌లను పంపిణీ చేశారు. టైలరింగ్, మెహందీ డిజైన్‌లో శిక్షణ పొందిన వారికి ఈ ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం గాంధీ జయంతి రోజున క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించి వారికి సహాయం చేసేవారని, అయితే ఈసారి స్వయం సహాయక సంఘంలోని మహిళలను ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టామన్నారు.  నైపుణ్యం, స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేయాలన్నారు.