డిస్కో డ్యాన్సర్​ (మిథున్​)కు దాదా సాహేబ్​ ఫాల్కే

ప్రధాని, కేంద్రమంత్రుల హర్షం

Sep 30, 2024 - 13:24
 0
డిస్కో డ్యాన్సర్​ (మిథున్​)కు దాదా సాహేబ్​ ఫాల్కే
కోల్​ కతా: బ్రేక్​ డ్యాన్స్​ తొలితరం నటుడిగా బాలీవుడ్​ లో ప్రఖ్యాతి గాంచిన మిథున్​ చక్రవర్తి (డిస్కో డ్యాన్సర్​)కు 2022 సంవత్సరం ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్​ ఫాల్కే లైఫ్​ టైమ్​ అచీవ్​ మెంట్​ అవార్డు లభించింది. సోమవారం కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్​ అధికారికంగా ప్రకటించారు. మిథున్​ చక్రవర్తి అద్భుతమైన సినిమా ప్రయాణం అనేక తరాలకు స్ఫూర్తినిస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ ఈ ఏడాది భారతీయ సినిమాకి దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తికి చేసిన విశిష్ట సేవలకు గాను ఈ అవార్డును అందించాలని నిర్ణయించినందుకు గర్వకారణమని మంత్రి తెలిపారు. అక్టోబర్​ 8 మిథున్​ చక్రవర్తి ఈ అవార్డును అందుకోనున్నారు. 
 
 1950లో కోల్​ కతాలో జన్మించిన తన జీవితంలో అనేక ఆటుపోట్లు అనుభవించాడు. చదువు పూర్తయ్యాక నక్సల్​ గా మారాడు. అనంతరం హింసా మార్గాన్ని విడనాడాడు. తొలుత సినీనటి హెలెన్​ వద్ద చిన్నాచితకా పనులు చేసే సహాయకుడిగా చేరాడు. ఆమె ఇంటికి వచ్చే దర్శక, నిర్మాతల కళ్లలో పడి సినీ రంగంలో అవకాశాలను దక్కించుకున్నాడు. 1976 లో మృగయ సినిమాతో సినీ రంగ ప్రవేశ చేశాడు. కానీ 1982తో దేశ వ్యాప్తంగా మిథున్​ చక్రవర్తి పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఆయన కెరీర్​ లో వెనుదిరిగి చూసుకోలేదు. ఈ సినిమా అంతగా సూపర్​, డూపర్​ హిట్​ అయ్యింది. ఈ సినిమాతోనే బ్రేక్​ డ్యాన్సర్​ గా పేరు ప్రఖ్యాతులు సాధించాడు. అప్పట్లోనే ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. ఇప్పటివరకు 350కిపైగా సినిమాలలో మిథున్​ నటించాడు. 
 
అవార్డు లభించడం సంతోషం: మిథున్​
భారతీయ చలనచిత్ర రంగంలో తనకు అందిన ఈ ప్రతిష్ఠాత్మక గౌరవానికి అత్యంత సంతోషం వ్యక్తం చేశారు. బహుమతి ప్రదానం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ వర్గాలు, సినీ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
 
ప్రధాని మోదీ అభినందనలు..
దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్నందుకు మిథున్‌ను అభినంచారు. భారత చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ అవార్డుతో సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. మితు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. 
 
కేంద్రమంత్రి జి. కిషన్​ రెడ్డి అభినందనలు..
ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడిన ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతీయ సినిమాకి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఆయన నటన నిర్మాతలకు ప్రేరణగా నిలిచిందన్నారు. నటనలో మిథున్ అంకితభావం, అసమానమైన ప్రతిభ, భారత వారసత్వానికి నిజమైన ప్రతిబింబాలుగా నిలిచాయని కిషన్​ రెడ్డి కొనియాడారు.