మంగళ్ మృతి తీరని లోటు ప్రధాని మోదీ విచారం
PM Modi mourns Mangal's death
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భగవాన్ బిర్సా ముండా వారసుడు మంగళ్ ముండా మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. రాంచీ రిమ్స్ లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. 25న కుంతీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రాంచీ రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఝార్ఖండ్ లోని గిరిజన సమాజానికి ఈయన మృతి తీరని లోటన్నారు. మృతి పట్ల ప్రధానితోపాటు రాష్ర్ట గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్, సీఎం హేమంత్ సోరెన్ లు విచారం వ్యక్తం చేశారు.