నా తెలంగాణ, రామకృష్ణాపూర్: గంజాయి నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని పలు కాలనీల్లో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో పోలీసులు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి రామకృష్ణాపూర్ పట్టణానికి గంజాయి సప్లై చేస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చెప్పట్టినట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు.
ఎస్ ఐ ఆధ్వర్యం లో రామాలయం, జ్యోతి నగర్, రామ్ నగర్, ఏ జోన్ ఏరియా, తిలక్ నగర్ మొదలైన కాలనీల్లో, పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపెల్లి మొదలైన గ్రామంలో అనుమానిత గంజాయి సేవించే వ్యక్తుల ఇండ్లను గంజాయి దాచిపెట్టేందుకు అవకాశం ఉన్న పొదలు పెరిగివున్న ఖాళీ స్థలలల్లో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణ ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ త పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని వారికి ఎప్పటికప్పుడు పలు అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజల ప్రాణాలకు హాని చేసే గంజాయి లాంటి మత్తు పదార్థాలను నిర్మూలించడంలో ప్రజలు, యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పట్టణంలో గంజాయి మూలాలను తొలగించడం కోసం పట్టణ పోలీసులు పటిష్ఠంగా పనిచేస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో సిబ్బంది జంగు, వెంకటేష్, సంపత్, బాలకృష్ణ, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.