యూఎన్ ఎస్ సీలో సంస్కరణలు అవసరం
చిన్నదేశాలకు సభ్యత్వం
భారత ప్రతినిధి పర్వతనేని హరీష్
న్యూయార్క్: ప్రపంచదేశాల సుస్థిర, శాంతి కోసం ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలను కూడా యూఎ ఎస్ సీ (ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి)లో శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్ పునరుద్ఘాటించింది. ఇందుకు యూఎన్ ఎస్ సీలో శాశ్వత, చట్టబద్ద, సమర్థవంతమైన మార్పులు అవసరమన్నారు.
శుక్రవారం యూఎన్ ఎస్ సీలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ.. భవిష్యత్ లో అన్ని దేశాల అభివృద్ధికి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత యూఎన్ఎస్ సీలో ప్రపంచదేశాల అసమానతలను తొలగించే అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆ దిశలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యూఎన్ ఎస్ సీ విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అలాంటి భద్రతా మండలి ప్రపంచదేశాలకు అవసరమన్నారు. ప్రపంచంలోని సమాన భౌగోళిక ప్రాతినిధ్యాన్ని భారత్ నొక్కి చెబుతుందన్నారు. చిన్న, పేద దేశాలను చేర్చడం కోసం చట్టబద్ధమైన, సమర్థవంతమైన కౌన్సిల్ అవసరమని అభిప్రాయం వ్యక్త చేశారు. అప్పుడు ప్రపంచంలోని ముఖ్యమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చన్నారు.
ప్రపంచదేశాల చేరికకు యూఎన్ ఎస్ సీని సంస్కరించడానికి భారత్ నిబద్ధతను ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. భద్రతా మండలి నిర్ణయాత్మక ప్రక్రియలలో అన్ని రంగాలకు న్యాయమైన, అర్థవంతమైన స్వరం ఉండేలా చూసుకోవడంపై భారతదేశ సంస్కరణ ప్రతిపాదన దృష్టి సారిస్తుందని పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు.