మహాకుంభ్ కు 3వేల ప్రత్యేక రైళ్లు
3 thousand special trains to Mahakumbh
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మేళా
జోరందుకున్న రూ. 4,500 కోట్ల ప్రాజెక్టు పనులు
లక్నో: యూపీ మహాకుంభ్ మేళా కోసం మూడువేల ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేస్తుంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభ్ మేళాను నిర్వహించనున్నారు. ఇందులో సూదూర ప్రాంతాల నుంచి 700 రైళ్లను నడపనుంది. ఈ మేరకు శుక్రవారం రైల్వే శాఖాధికారి మీడియాకు వివరాలందించారు. రైల్వే మంత్రిత్వ శాఖకు 19న సీఎం యోగి లేఖ రాశారన్నారు. ఈ లేఖ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించిందన్నారు. జాతర సమయంలో ఈ ప్రాంతం గుండా ప్రయాణించే పదివేల సాధారణ రైళ్లకు ఇవి అదనమన్నారు. మొత్తం 13,017 రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. 2019లో 5,694 ప్రత్యేక రైళ్లను నడిపారు. గౌహతి, రంగపర నార్త్, ముంబై సీఎస్టీ, నాగ్‌పూర్, పూణే, సికింద్రాబాద్, గుంటూరు, నాందేడ్, విశాఖపట్నం, భువనేశ్వర్, పూరీ, సంబల్‌పూర్, కన్యాకుమారి, త్రివనంతపురం నార్త్, చెన్నై సెంట్రల్, హౌరా, డా. అంబేద్కర్ నగర్, వాపి, అహ్మదాబాద్, రాజ్‌కోట్, వడోదర, వల్సాద్, భావ్‌నగర్, జయనగర్, దర్భంగా, ముజఫర్‌పూర్, ధన్‌బాద్, పాట్నా, గయా, రక్సాల్, సహర్సా, బెలగావి, మైసూర్, ఉదయపూర్ సిటీ, బార్మర్, టాటానగర్, రాంచీ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.