పాక్​ కు జై శంకర్​ వార్నింగ్​

విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​

Oct 27, 2024 - 18:10
 0
పాక్​ కు జై శంకర్​ వార్నింగ్​

ముంబాయి: పగలు బేరమాడం, రాత్రి భయబ్రాంతులకు గురి చేయడం భారత్​ కు ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​ పరోక్షంగా పాక్​ ను విమర్శించారు. ఆదివారం 26/11 ఉగ్రదాడిపై మీడియాతో మాట్లాడారు. మళ్లీ అలాంటి ఘటన జరిగితే దానికి ధీటుగానే ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఉగ్రవాద నిరోధక కమిటీకి తాను అధ్యక్షుడిగా ఉండేవాడినని జైశంకర్ చెప్పారు. 'ఉగ్రదాడి జరిగిన హోటల్‌లోనే యాంటీ టెర్రరిజం కమిటీ సమావేశం నిర్వహించాం' అని చెప్పారు. ఉగ్రవాద దాడులపై ఇక నటనను కట్టిపెట్టాలన్నారు. లడఖ్​ లో నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్​ తిరిగి ప్రారంభిస్తామన్నారు. సమస్యలన్నీ ఒక్కొక్కటిగా సమసిపోయాయని తెలిపారు. మహారాష్ర్టలో కేంద్ర ప్రభుత్వం తరహా భావజాలంతో కూడిన ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. మూడో దఫా మోదీ ప్రభుత్వం దేశ ఆర్థికంపైనే ప్రముఖంగా దృష్టి సారించిందని ఎస్​. జై శంకర్​ స్పష్టం చేశారు.