ఈవీ పరిశ్రమల ద్వారా4కోట్ల ఉద్యోగాల సృష్టి
వాహనాల్లో అగ్నిప్రమాదాలపై వర్క్ షాప్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
నాగ్‌పూర్: భారత్ లో ఎలక్ర్టిక్ వాహనాల పరిశ్రమ 2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాల్లో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు శుక్రవారం నాగ్ పూర్ లో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో ప్రసంగించారు. ఈవీఎస లో ఉపయోగించిన లిథియం అయాన్ బ్యాటరీ ప్రాముఖ్యతను గడ్కరీ వివరించారు. ఆరు శాతం లిథియం నిల్వలు జమ్మూలో ఉన్నాయని తెలిపారు. లిథియం అయాన్ బ్యాటరీల రూపంలో 60 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించబడుతుందన్నారు. దీంతో లిథియం అయాన్ బ్యాటరీల ధర తగ్గుతుందన్నారు. గత మూడేళ్లలో ఎలక్ర్టిక్ ద్విచక్ర వాహనాల్లో 30 అగ్ని ప్రమాదాలు జరిగాయన్నారు. ఇవి వాహనాల మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. దీంతో ఈవీ వాహనాల రక్షణ కోసం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ల నిపుణుల కమిటీ ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ స్టాండర్డ్ (ఎఐఎస్) బ్యాటరీ భద్రతపై పరిశోధనతో ఆఫ్ టెక్నాలజీ ముందుకు వచ్చిందని తెలిపారు. దీంతో బ్యాటరీల పనితీరు, భద్రతకు భరోసా లభించిందని, ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ అలారంలను తప్పనిసరిగా ఏర్పాటు చేసిందన్నారు. బ్యాటరీ వ్యర్థాల నిర్వహణపై గడ్కరీ మాట్లాడుతూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ 2022 నాటికి ఈవీ బ్యాటరీ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి నిబంధనలను రూపొందించిందని, బ్యాటరీ రికవరీ, రీసైక్లింగ్ నిర్వహణ కోసం బ్యాటరీ తయారీదారులపై ఈ నియమాలు తప్పనిసరి చేశామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. గతేడాది ఈవీ వాహానాల కొనుగోలు 45 శాతం పెరుగుదల ఉండగా, ఈ యేడాది అది 56 శాతానికి చేరిందన్నారు. ఈ రంగంలో 400 కంటే ఎక్కువ స్టార్టప్‌లు సృష్టించబడ్డాయని, 2025 నాటికి మార్కెట్లో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వాటా 8 శాతానికి పైగా ఉంటుందని మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.