కింగ్ నాగార్జున- అల్లరి నరేష్- రాజ్ తరుణ్ మల్టీస్టారర్ `నా సామి రంగ`లో కుమారి పాత్రలో రుక్షార్ థిల్లాన్ అద్భుతంగా నటించి మెప్పించింది. కుర్రకారు హార్ట్ బీట్ గా మారింది రుక్షార్. తనదైన అందం ఎనర్జీతో ఊపు తెచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన రుక్షార్ నటించింది. తన సినిమా ప్రచారంలో రుక్షార్ ఎంతో నిజాయితీగా కనిపించింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో అగ్రనాయికగా ఎదగాలనేది రుక్షార్ థిల్లాన్ ఆశ. కానీ ఆరంభం యువహీరోలతోనే అవకాశాలొచ్చాయి. సిరీస్ సరసన ఏబిసిడి చిత్రంలోను ఈ బ్యూటీ నటించినా దాని ఫలితం ఏమిటో తెలిసిందే. టాలీవుడ్ లో తన కల ఇప్పట్లో నెరవేరేట్టు లేదు. అయినా నిరాశ చెందక రుక్షార్ కొన్ని వరుస ఫోటోషూట్లతో తెలుగు యువతను టీజ్ చేస్తోంది. ముఖ్యంగా ఈ బ్యూటీ ఇన్నర్ అందాల ఎలివేషన్ మతులు చెడగొడుతోంది. దానిని కవర్ చేస్తూ ఒక ఫుల్ స్లీవ్స్ షర్ట్ ని ధరించింది రుక్షాన్. కుర్రబ్యూటీ స్పీడ్ చూస్తుంటే ఆగేట్టు లేదు. తీక్షణంగా సూటిగా కొంటెగా వలపు బాణాలను గురి చూసి విసురుతున్న రుక్షార్ ని సోషల్ మీడియాల్లో భారీగానే నెటిజనులు అనుసరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. రుక్షార్ నటించే తదుపరి చిత్రానికి సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.