అనూ...ఆలస్యం ఎందుకు?

స్టార్ హీరోయిన్ అనుష్క చేస్తానంటే స్టార్ హీరోల సైతం ఛాన్స్ ఇస్తారు. అయినా కూడా అమ్మడు రెండు మూడేళ్లు గ్యాప్ తీసుకుంది.

Apr 18, 2024 - 15:07
 0
అనూ...ఆలస్యం ఎందుకు?

స్టార్ హీరోయిన్ అనుష్క చేస్తానంటే స్టార్ హీరోల సైతం ఛాన్స్ ఇస్తారు. అయినా కూడా అమ్మడు రెండు మూడేళ్లు గ్యాప్ తీసుకుంది. నిశ్శబ్ధం సినిమా తర్వాత లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనుష్క ప్రస్తుతం తెలుగులో క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా.. మలయాళంలో మరో సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే అవ్వడం విశేషం. తనదైన శైలిలో నటించి మెప్పించడంలో అనుష్క ముందుంటుంది. మొదటి నుంచి ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే గ్లామర్ క్వీన్ గా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క ఆ తర్వాత ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో సత్తా చాటింది. ఆమె చేసిన అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలు స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలకు ధీటుగా వసూళ్లు రాబట్టాయి. అయితే ఇప్పుడు అనుష్క తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుంది. సీనియారిటీ వచ్చేసింది కాబట్టి ఇక మీదట పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ కథలనే చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యిందట.  ఈమధ్య ఒక స్టార్ ప్రొడ్యూసర్ స్టార్ హీరోతో చేస్తున్న భారీ సినిమాలో హీరోయిన్ గా అనుష్కని అడిగారట. అనుష్క మాత్రం సింపుల్ గా వారికి నో చెప్పేసిందట. అనుష్క నుంచి అలాంటి ఆన్సర్ వస్తుందని ముందే ఊహించిన ఆ నిర్మాతలు లైట్ తీసుకుని వేరే హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారట. ఇక మీదట సినిమాల విషయంలో అనుష్క స్ట్రిక్ రూల్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. కమర్షియల్ సినిమాల్లో మాక్సిమం నటించే ఛాన్స్ లేదట. ఒకవేళ నటించాల్సి వచ్చినా తన పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకుంటుందట. ఇదిలా ఉంటే మంచు విష్ణు కన్నప్పలో స్వీటీ అనుష్క కూడా నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. ప్రభాస్ తో పాటుగా అనుష్క క్రేజ్ ను కూడా వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు కన్నప్ప టీం. అయితే అనుష్క ఆ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కోలీవుడ్ నుంచి కూడా అనుష్కకు ఆఫర్లు వస్తున్నా వాటికి కూడా నో చెప్పేస్తుందట అనుష్క. అక్కడ ఆల్రెడీ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో నయనతార, త్రిష అదరగొట్టేస్తున్నారు కాబట్టి అక్కడ కన్నా తెలుగులో తన సత్తా చాటాలని చూస్తుంది అనుష్క.