లక్నో: పద్దెనిమిదేళ్ల యువతికి శీతల పానీయంలో మత్తుకలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడడమే గాక ఆ వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఎస్పీ నేత వీరేంద్ర పాల్ పై కేసు నమోదైంది. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. వీరేంద్ర పాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ కేసు యూపీలోని మౌలో నమోదైంది.
కొద్దిరోజుల క్రితమే యూపీలోని ఎస్పీ నేత నవాబ్ షింగ్ యాదవ్ పై కూడా బాలికపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. యూపీ వ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర ఆరోపణలు, నిరసనలు వ్యక్తమవుతుండగా అదే పార్టీకి చెందిన మరో నాయకుడు కూడా మహిళలు,యువతుల పట్ల అసభ్య ప్రవర్తనపై కేసు నమోదు కావడంతో ప్రజలు ఈసడించుకుంటున్నారు.
వీరేంద్ర పాల్ పై 115(2), 351(2), 352, 123, 64(2) కింద కేసులు నమోదయ్యాయి. వీడియోలపై యువతి సాక్ష్యాలతో సహా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.