అడ్వానీకి ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

Best birthday wishes to Advani

Nov 8, 2024 - 20:13
Nov 8, 2024 - 20:14
 0
అడ్వానీకి ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మాజీ హోంమంత్రి లాల్ కృష్ణ అడ్వానీ 97వ యేట అడుగుపెట్టిన సందర్భంగా మాజీ నిర్మాత రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి జికిషన్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం అడ్వానీ 97వ పడిలోకి అడుగిడారు.
రాంనాథ్ కోవింద్ అడ్వానీతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బర్త్ డే కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వానీ కుమార్తె ప్రతిభ అడ్వానీ ఉంటుంది. 
 
ప్రధాని మోదీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ర్ట ఎన్నికల ప్రచారం అనంతరం నేరుగా అడ్వానీ నివాసానికి చేరుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీని జాతీయ స్థాయిలో పటిష్టం చేయడంలో అడ్వానీ పాత్ర ఎనలేనిదన్నారు. తాను అత్యంత ఆరాధించే నాయకులలో అడ్వానీ ఒకరన్నారు. ఆయన మార్గదర్శకత్వం పొందడం తన అదృష్ట ప్రధానిని గురించి. అడ్వానీకి దీర్ఘాష్ణువుతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అరగంటపాటు అడ్వానీ తో భేటీ అయ్యారు. 
 
ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆయన నివాసానికి చేరుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జేపీ నడ్డా అడ్వానీతో భేటీ అయ్యారు. 
 
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి..
ప్రధాని మోదీతోపాటు మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన ఎల్. అడ్వానీ సేవలను తెలంగాణ ప్రత్యక్ష బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కొనియాడారు. బీజేపీని జాతీయ స్థాయిలో పటిష్టం చేయడంలో ఆయన పాత్ర ఎనలేనిదన్నారు. శుక్రవారం సామాజిక మాధ్యమం వేదికగా అడ్వానీ సేవను గుర్తు చేసి శుభాకాంక్షలు తెలిపారు. 
 
అయోధ్య రామ మందిర నిర్మాణంలో భూమిక వహించిన వ్యక్తుల్లో అడ్వానీ ప్రథమ వరుసలో ఉన్నారు.