అత్యాచారం, హత్య బెదిరింపులు
పోలీసులకు స్వాతి మాలివాల్ ఫిర్యాదు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: తనపై అత్యాచారం చేసి హత్య చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతిమాలివాల్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆప్ సోషల్ మీడియా ప్రతినిధి ధ్రువ్ తనపై అనుచిత వ్యాఖ్యలతో కూడిన వీడియోను పోస్ట్ చేశాడని మండిపడ్డారు. యూట్యూబ్ లో పెట్టిన తీసేయాలని పలుమార్లు అతన్ని సంప్రదించేందుకు చూసినా అతను అందుబాటులోకి రాలేదన్నారు. ఆ తరువాతే తనపై బెదిరింపులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. తనపై దుష్ర్పచారం చేస్తూ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనకు తెలియకుండా వీడియో తీసి పోస్ట్ చేయడం ఏ మేరకు సబబన్నారు. బెదిరింపులపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు స్వాతిమాలివాల్ పేర్కొన్నారు.