బద్లాపూర్ లైంగిక కేసు పోలీసులకు హైకోర్టు మందలింపు
High Court reprimands police in Badlapur sex case
ముంబై: థానే బద్లాపూర్ ఆదర్శ్ విద్యామందిర్ లైంగిక వేధింపులపై బాంబే హైకోర్టు పోలీసుల తీరును తప్పుబట్టింది. సుమోటోగా కేసును స్వీకరించి హైకోర్టు గురువారం విచారించింది. ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేసే వరకూ పోలీసులేం చేశారని ప్రశ్నించింది.సమాచారం అందగానే చర్యలు తీసుకోకుండా, కనీసం ఎఫ్ ఐఆర్ నమోదు చేయకుండా ఏం చేస్తున్నారని నిలదీసింది. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ కేసులో ఇద్దరు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు వివరించారు. పాఠశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ తరఫు న్యాయవాది బీరేంద్ర సరాఫ్ కోర్టుకు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణపై అఫిడవిట్ సమర్పించాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.