నక్సల్స్ నుంచి పూర్తి విముక్తి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
నా తెలంగాణ న్యూ ఢిల్లీ: నక్సల్స్ సమస్య నుంచి దేశం పూర్తిగా విముక్తి పొందే సమయం దగ్గరలో ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. చత్తీస్ గఢ్ లో నక్సల్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఇప్పటివరకు 125 మంది నక్సలైట్లు హతమయ్యారని 352 మందిపైగా అరెస్టులు జరిగాయన్నారు. ఆదివారం హోంశాఖ మంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడారు.
పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు నక్సల్ కారిడార్‌లో మావోయిస్టుల ఉనికి లేదని షా స్పష్టం చేశారు. దేశంలో నక్సలిజం అంతం కాబోతోందని షా తెలిపారు. ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు కూడా పూర్తిగా స్వేచ్ఛగా మారాయన్నారు. చత్తీస్ గఢ్ లోని కొన్ని ప్రాంతాల్లో నక్సలైట్లు చురుకుగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ సమస్య నుంచి విముక్తి చేసే పని ప్రారంభించామన్నారు.