అమిత్ షాపై ఫేక్ వీడియో తెలంగాణకు చెందిన అరుణ్ రెడ్డి అరెస్టు
ప్రకటించిన పోలీసులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్రమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై తెలంగాణకు చెందిన అరుణ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు శుక్రవారం ప్రకటించారు. స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ పేరుతో అరుణ్ రెడ్డి సోషల్ మీడియాలో ఖాతా నడుపుతున్నాడని, అమిత్ షా ఎడిట్ చేసిన వీడియోను పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తప్పుడు ప్రచారం చేయాలనే లక్ష్యంతో హోం మంత్రి అమిత్ షాపై ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేశాడని పోలీసులు గుర్తించినట్లు వివరించారు. ఐపీ అడ్రస్ ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఇతన్ని అరెస్టు చేశామని ప్రకటించారు.
ఎస్సీ,ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ నిందితులు ఫేక్ వీడియో సృష్టించి ప్రచారం చేశారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అరుణ్ రెడ్డిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు.