రక్తాభిమానం.. రక్తంతో ఎమ్మెల్యే చిత్రం

అభిమానం చాటుకున్న భైంసా మండల బీజేపీ ఉపాధ్యక్షుడు

Aug 28, 2024 - 13:55
 0
రక్తాభిమానం.. రక్తంతో ఎమ్మెల్యే చిత్రం

నా తెలంగాణ, నిర్మల్: సినిమా నటులకు అభిమానులుండటం సహజం. అయితే నాయకులకు కూడా అభిమానులుంటారని, వారి అభిమానానికి హద్దులుండవని  రుజువు చేశారు భైంసా మండలం వాలేగాం వాసి ఎస్ గంగాప్రసాద్. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ఆయనను కలిసి అభినందించారు. అయితే భైంసా మండల బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్ గంగా ప్రసాద్ మాత్రం తన రక్తంతో ఎమ్మెల్యే చిత్రపటాన్ని వేయించి బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి చిత్రం గీసేందుకు అవసరమైన 105 మి.లీ రక్తాన్ని తీయించి పెయింటర్ కు అందజేశాడు. ఆయన చిత్రాన్ని గీశాక ఆ చిత్రాన్ని తన అభిమాన నాయకునికి అందజేశాడు.