మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే పాయల్ శంకర్
నా తెలంగాణ, ఆదిలాబాద్: మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జైనథ్ మండలంలో విజయ తెలంగాణ ఇందిరా మహిళా శక్తి డైరీ ఫార్మ్ ను ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
మహిళా సంఘాలు అభివృద్ధి దిశగా వెళ్లడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితాలు రావడం లేదన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. మహిళా సంఘాలన్నీ వ్యాపారాలలో అభివృద్ధి సాధించాలన్నారు.
సయం శక్తులతో ఎదిగి మహిళా సాధికారత సాధించాలన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని ఋణాలు అందించాలని అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, బీజేపీ నాయకులు విజయ్, అశోక్ రెడ్డి, ప్రతాప్, విశాల్, ఆదినాథ్, రాజు, మురళీధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.