వర్షాలు సమృద్ధి.. వరి ఉత్పత్తి ఆశాజనకం

కేంద్రమంత్రి శివరాజ్​ సిగ్​ చౌహాన్​

Sep 19, 2024 - 18:40
 0
వర్షాలు సమృద్ధి.. వరి ఉత్పత్తి ఆశాజనకం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో ఈ యేడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో వరి ఉత్పత్తి ఆశించిన దాని కంటే ఎక్కువగానే ఉందని కేంద్ర మంత్రి శివరాజ్​ సిం చౌహాన్​ చెప్పారు. గురువారం ఆయన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విలేఖరులో మాట్లాడరు. కొన్ని రాష్​ర్టాల్లో భారీ వర్షాలు, వరదలు ఉన్నప్పటికీ గతేడాది కంటే ఈ యేడాది వరి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందన్నారు. అలాగే బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నియంత్రణలను సడలించాలని దేశం పరిశీలిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో రైతులు కొత్త పంటలకు సిద్ధంగా కావాలని చౌహాన్​ విజ్ఞప్తి చేశారు. జూన్​ లో వర్షాలు అంతగా లేకున్నా ఆ తరువాత సమృద్ధిగా కురిశాయి దేశంలో 7.6 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయన్నారు. అయితే భారీ వర్షాల కారణంగా కొంతపంట నష్టం జరగడం పట్ల ఆందోళన చెందుతున్నామని తెలిపారు. నష్టంపై రైతుల నుంచి పంటనష్టం వివరాలు తీసుకొని నష్టాన్ని భర్తీ చేసే చర్యలను చేపట్టామని మంత్రి చౌహాన్​ స్పష్టం చేశారు.