రాహుల్ క్షమాపణలు చెప్పాలి
Rahul should apologize
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డిమాండ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ ఎంపీలను తోయడం పట్ల వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డిమాండ్ చేశారు. గురువారం ఎంపీ సారంగి, రాజ్ పుత్ లను రామ్ మనోహర లోహియా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.రాహుల్ ప్రవర్తన నాగరిక సమాజం ఊహించలేనిదన్నారు. ఈ రోజు పరిణామాలకు రాహుల్, ఖర్గేలు క్షమాపణలు చెబుతారని అనుకున్నానని కానీ వారు తప్పు చేసింది గాక, బీజేపీనే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఎంత దిగజారిన రాజకీయాలకు పాల్పడుతున్నారనేది అర్థమవుతుందని మండిపడ్డారు. మకర ద్వారం వద్ద బీజేపీ ఎంపీలు నిరసన తెలుపుతుండగా, భద్రతా సిబ్బంది కాంగ్రెస్ ఎంపీలను మరో ద్వారం ద్వారా లోపలికి వెళ్లాలని సూచించారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని రాహుల్, ఖర్గేలు వాగ్వివాదానికి, తోపులాటలకు దిగి ఎంపీలను గాయపరిచారన్నారు. ఈ దాడులపై బీజేపీ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. సీనియర్ ఎంపీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అన్నారు. అంతేగాక గిరిజన మహిళా ఎంపీపై రాహుల్ అనుచిత ప్రవర్తనను కూడా హర్షించమని శివరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.