ఆప్​ చేజారిన ఢిల్లీ కమలం విజయఢంకా

Delhi's BJP Victory lost by AAP

Jun 6, 2024 - 14:15
 0
ఆప్​ చేజారిన ఢిల్లీ కమలం విజయఢంకా

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్​ (ఆమ్​ ఆద్మీ పార్టీ)లో కలకలం మొదలైంది. ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాలు చేజారడంతో భవిష్యత్​ కార్యాచరణపై ఆ పార్టీలో టెన్షన్​ నెలకొంది. మరోవైపు కమలం పార్టీ ఇక్కడ విజయఢంకా మోగించింది. ఓ వైపు సీఎం కేజ్రీవాల్​ మద్యం కుంభకోణంలో తీహార్​ జైలులో ఉన్నారు. ఈ కుంభకోణం కేజ్రీవాల్​ పార్టీ ప్రతిష్ఠను పూర్తిగా మసక బార్చిందనే చెప్పొచ్చు.

సీఎం కేజ్రీవాల్​ సతీమణి గురువారం సాయంత్రం అత్యవసర పార్టీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. హస్తిన చేజారడంతో ఉన్న ఎమ్మెల్యేలోనైనా ఎలా కాపాడుకోవాలన్నదానిపైనే దృష్టి సారించనున్నారు. సాయంత్రం 5 గంటల తరువాత పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 
కాగా ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాల్లో ఓడిన వారంతా ఆప్​ కు వీరవిధేయులుగా ముద్ర పడ్డారు. ఆప్​ ఏడుస్థానాలు, కాంగ్రెస్​ మూడు స్థానాల్లో పోటీ చేసినా ఫలితం దక్కకపోవడం విశేషం.