కాంగ్రెస్​ ఎమ్మెల్యేపై ఆదిత్య ఠాక్రే ఫైర్​ 

Aditya Thackeray fires on Congress MLA

Dec 19, 2024 - 18:09
 0
కాంగ్రెస్​ ఎమ్మెల్యేపై ఆదిత్య ఠాక్రే ఫైర్​ 

ముంబాయి కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న లక్ష్మణ్​ సవాది
మరాఠాలు రక్తం చిందించిన మాతృభూమిపై ఇలాంటి వ్యాఖ్యలు సహించం

ముంబాయి: ముంబాయి మరాఠీల మాతృభూమి ఈ భూమిని పరాయి పాలన చేయాలనుకునే ఏ ఒక్కరిని, పార్టీని క్షమించేది లేదని శివసేన ఆదిత్యఠాక్రే అన్నారు. కర్ణాటక కాంగ్రెస్​ ఎమ్మెల్యే లక్ష్మణ్​ సవాది ప్రకటనపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. గురువారం మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రకటనను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమన్నారు. సహించమన్నారు. మరాఠీలు రక్తం చిందించిన నేల ముంబాయి అన్నారు. బెలగావి, ముంబాయి కేంద్ర పాలిత ప్రాంతాలన్న లక్ష్మణ్​ వాదనను ఆదిత్య తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. మహారాష్ర్ట నుంచి ముంబాయిని వేరు చేసే ప్రయత్నాన్ని సహించబోమన్నారు. కాంగ్రెస్​, బీజేపీ ఇతర ఏ పార్టీలైనా ముంబాయి విచ్ఛిన్నం చేసే ప్రయత్నాన్ని శివసేన (యూబీటీ) అడ్డుకుంటుందన్నారు. బెలగావి నియంత్రణపై దశాబ్దాలుగా మహారాష్ర్ట–కర్ణాటకల మధ్య వివాదం నడుస్తుంది. బెలగావి కర్ణాటక సరిహద్దు పట్టణం. ఇక్కడ అధిక సంఖ్యలో మరాఠీ భాష మాట్లాడే జనాభా ఉంది.