రష్యాలో క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీ!
Cancer vaccine manufacturing in Russia!
శతాబ్ధంలోనే అతిపెద్ద ఆవిష్కరణ
మాస్కో: రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీలో విజయం సాధించింది. ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని మీడియాకు వివరించింది. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్ ఈ సమాచారాన్ని అందించారు. ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది నుంచి రష్యన్ పౌరులకు ఉచితంగానే అందజేస్తామన్నారు.
ఎంఆర్ఎన్ ఎ (మెసెంజర్ రిబో న్యూక్లిక్ యాసిడ్) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిందని డైరెక్టర్ ఆండ్రీ చెప్పారు. రష్యా ఆవిష్కరణ శతాబ్దపు అతిపెద్ద ఆవిష్కరణగా అభివర్ణించారు. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కణితి పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయని తేలిందన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ వ్యాక్సిన్ పై ఈ యేడాది ప్రారంభంలోనే ఒక ప్రకటన చేశారు. ఎంఆర్ ఎన్ ఎ క్యాన్సర్ వైరస్, బ్యాక్టీరియా మన శరీరంపై దాడి చేసినప్పుడు వాటితో పోరాడటానికి ప్రోటీన్‌లను తయారు చేస్తుంది. ఈ వ్యాక్సిన్ కేవలం అదే సమయంలో మన కణాలకు సందేశాలను పంపుతుంది. దీంతో క్యాన్సర్ కు కారకమైన వైరస్ ఆటకట్టించడం సులువవుతుంది.
2022లో భారతదేశంలో 14.13 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 7.22 లక్షల మంది మహిళల్లో, 6.91 లక్షల మంది పురుషుల్లో క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. 2022లో 9.16 లక్షల మంది రోగులు క్యాన్సర్‌తో మరణించారు. రానున్న ఐదేళ్లలో క్యాన్సర్ రోగులు 12 శాతం పెరుగుతారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంచనా వేసింది. ఏది ఏమైనా రష్యా ఈ మందును తొలిగా భారత్ కు అందజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ మందు పనితీరుపై కూడా పరిశోధనలు చేపట్టి సొంతంగానే క్యాన్సర్ వ్యాక్సిన్ రూపకల్పనకు భారత్ కూడా కృషి చేయనున్నట్లు తెలిపారు.