యుద్ధానికి సిద్ధంగా ఉండాలి!
Be ready for battle!
శాంతి, పరిష్కార మార్గాల ద్వారానే ముందుకు
ప్రపంచంలో నెలకున్న అస్థిరత నేపథ్యంలోనే అప్రమత్తత
సైనిక రంగం మరిన్ని ఆయుధాలు సమకూర్చుకోవాలి
సాంకేతికతను మరింత మెరుగుపర్చుకోవాలి
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
లక్నో: సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం లక్నోలో సైనిక సమావేశం (జాయింట్ కమాండర్స్)లో ప్రసంగించారు. భవిష్యత్ లో ఎదుర్కొనే సమస్యలపై పూర్తి సన్నద్ధంగా ఉండడంపైనే దృష్టి కేంద్రీకరించాలని సైనికులకు పిలుపునిచ్చారు. ప్రపంచంలో అస్థిరత నెలకున్నా భారత్ శాంతిపూర్వక సమాధానాలు, పరిష్కార మార్గాలతోనే ముందుకు వెళుతుందన్నారు. అయినా దేశ సైనికులు అన్నింటికీ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం అవసరమన్నారు. ఉమ్మడి సైనిక విధానం అభివృద్ధి, భవిష్యత్ లో ఎదుర్కునే సవాళ్లు, ప్రపంచ యుద్ధాలు, కవ్వింపు చర్యలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. శత్రువు ఊహించని దాడులను కూడా సమర్థవంతంగా తిప్పికొడుతూనే వారిపై దాడికి సిద్ధంగా ఉండాలని సైనికులకు పిలుపునిచ్చారు. దేశ సరిహద్దులో శాంతి, సుస్థిరతలు సవాల్ విసురుతున్న ప్రస్తుత తరుణంలో సైనిక నాయకత్వం అప్రమత్తత పాటించాలన్నారు. ఆయుధ డిపోల్లో మరిన్ని ఆయుధాలను సమకూర్చుకోవాలన్నారు.
సైనిక రంగం ఆధునాత సాంకేతికత, ఏఐ టెక్నాలజీ వంటి వాటిపై దృష్టి సారించి నాయకత్వాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.