కెన్యా పాఠశాలలో అగ్నిప్రమాదం 17మంది చిన్నారులు మృతి
17 children killed in Kenyan school fire
నైరోబీ: కెన్యాలోని ఓ ప్రైమరీ బోర్డింగ్ పాఠశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది విద్యార్థులు దుర్మరణం చెందగా, 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబీకులకు తన సానుభూతిని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక యంత్రాంగం అప్రమత్తమై మిగతా పిల్లలను పాఠశాల నుంచి అత్యంత కష్టం మీద కాపాడగలిగారు.
కెన్యాలో అగ్నిప్రమాదాలు కొత్తేం కాదు. 2017లో నైరోబీలో ఓ పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా 9మంది, క్యాంగులీలో 2001లో జరిగిన అగ్ని ప్రమాదంలో 58 మంది, 2012లో హోమా ఆబే కౌంటీలో 8మంది అగ్నిప్రమాదంలో మృతిచెందారు.