ఆప్ కు షాక్ బీజేపీలో చేరిన ఐదు కౌన్సిలర్లు
Five councilors who joined BJP came as a shock to AAP
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ఆదివారం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సచ్ దేవా వారిని సాదారంగా ఆహ్వానించి పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బీజేపీలో చేరిన వారిలో రామ్ చంద్ర, పవన్ షెహ్రావత్, మంజు నిర్మల్, సుగంధ బిదూరి, మమతా పవన్ లు ఉన్నారు. ఆప్ పార్టీ అవినీతికి కేరాఫ్ గా మారిందని సచ్ దేవా అన్నారు. మోదీ నేతృత్వంలోని అభివృద్ధిని చూసే పార్టీలో చేరారని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనుకునే వారు బీజేపీలో చేరుతున్నట్లు సచ్ దేవా తెలిపారు.