బంగ్లా ఎంపీ హత్య? అనుమానాస్పద స్థితిలో మృతి

విచారణ ముమ్మరం చేసిన కోల్​ కతా పోలీసులు వివరాలు కోరిన బంగ్లా ఎంబసీ ముగ్గురి అరెస్టు విచారణ

May 22, 2024 - 16:31
 0
బంగ్లా ఎంపీ హత్య? అనుమానాస్పద స్థితిలో మృతి

​ కోల్​ కతా: కనిపించకుండా పోయిన బంగ్లాదేశ్​ ఎంపీ అన్వరుల్​ అజీమ్​ కోల్​ కతాలో శవమై కనిపించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంపై పోలీసులు బుధవారం పలు వివరాలను మీడియాకు వెల్లడించారు. మే 12న చికిత్స కోసం కోల్​ కతాకు వచ్చారు. అనంతరం తన మిత్రుడు గోపాల్ బిస్వాస్‌ని కలవడానికి కోల్‌కతాలోని తన ఇంటికి వెళ్లాడు.

మరుసటి రోజు మధ్యాహ్నం 1.41 గంటలకు వైద్యుడిని కలవమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ ప్రాంతంలోని సీసీ టీవీని పోలీసులు జల్లెడ పడుతున్నారు. న్యూ టౌన్ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఎంపీ అన్వరుల్ మృతదేహం లభ్యమైందని కోల్‌కతా పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు బంగ్లాదేశీయులను అరెస్టు చేశామన్నారు.

ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మే 17 న, బీహార్‌లోని ఫోన్ లొకేషన్​ కనుగొన్నామన్నారు. ఆ తరువాత ఫోన్​ స్వీచ్ఛాఫ్​ అయినట్లు తెలిపారు. ఆ తరువాత న్యూఢిల్లీకి వెళ్లినట్లు అతని ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. స్నేహితుడికి సాయంత్రం రేపు సాయంత్రం వస్తానని వాట్సాప్​ సందేశం కూడా పంపాడని గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. 

కాగా ఎంపీ అనర్వుల్​ ది హత్య? అన్న అనుమానాల నేపథ్యంలో బంగ్లాదేశ్​ ఎంబసీ పోలీసులతో నిరంతరం టచ్‌లో ఉంది. మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరింది.

మే 13 నుంచి ఎంపీ ఫోన్​ స్వీచ్​ ఆఫ్​ కావడంతో బంగ్లాదేశ్​ లోని ఆయన కుటుంబ సభ్యులు బంగ్లా ప్రధాని షేక్​ హసీనాను ఆశ్రయించారు. దీంతో ఈ కేసును కోల్​ కతా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అన్వరుల్ అజీమ్ అనార్ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి చెందిన ఎంపీ. అతను 2014, 2018, 2024 ఎన్నికల్లో జెనైదా-4 స్థానం నుంచి గెలుపొందారు.