కీలక భాగస్వామ్యంపై చర్చలు

యూఏఈకి వెళ్లిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​

Jun 23, 2024 - 14:33
 0
కీలక భాగస్వామ్యంపై చర్చలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​–యూఏఈ మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్​.జైశంకర్​ ఆదివారం యూఏఈ వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన అబ్దుల్లా బిన్​ జాయెద్​ అల్​ నహ్యాన్​ తో కీలక చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు గాజాలోని ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా యూఏఈ భారత్​ మధ్య ఇప్పటికే అనేక విషయాల్లో భాగస్వామ్యాలు బలోపేతంగా ఉన్నాయి. ఇరుదేశాల సంబంధాలు మరింత మెరుగ్గా ఉండాలని భారత్​ ప్రయత్నిస్తోంది. ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు 2022లో ఇరుదేశాలు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా–సీఈపీఏ)పై సంతకాలు కూడా చేశాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అతి త్వరలో యూఏఈలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.