చవితి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి

ఎస్పీ జానకి షర్మిల

Aug 22, 2024 - 17:36
 0
చవితి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి

నా తెలంగాణ, నిర్మల్: వచ్చే నెలలో రానున్న వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎస్పీ జానకి షర్మిల అధికారులను ఆదేశించారు. వినాయక ఉత్సవ బందోబస్తు సన్నాహక సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశం లో ఎస్పీ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదన్నారు. అధికారులు, సిబ్బంది కలిసి పనిచేయాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా వేడుకలు జరిగేలా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. గణేశ విగ్రహాల ప్రతిష్ఠాపనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్లు నిర్వాహకులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించాలన్నారు. నిర్వహణ, భద్రతకు సంబంధించి మున్సిపల్, అగ్నిమాపక,  నీటి పారుదల శాఖ, వైద్య, విద్యుత్‌, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం, మండపం వద్ద నిర్వాహకులు, ఫోన్​ నెంబర్లు తదితర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. మండప కమిటీ నిర్వాహకుల వివరాలను నమోదు చేయాలన్నారు. వారితో సమన్వయంగా ముందుకు వెళ్లి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకీ షర్మీల తెలిపారు. 
సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వదంతులు నమ్మవద్దని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.