పట్టణంలో బీజేపీ తిరంగా బైక్ ర్యాలీ

BJP Tiranga bike rally in town

Aug 12, 2024 - 11:56
 0
పట్టణంలో బీజేపీ తిరంగా బైక్ ర్యాలీ

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: మన్ కీ బాత్ లో భాగంగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు పట్టణంలో హర్ ఘర్ తిరంగా అభ్యాన్​ కార్యక్రమన్ని జరుపుకున్నారు. బీజేవైఎం పట్టణ అధ్యక్షులు సంతోష్ రామ్ నాయక్ ఆధ్వర్యంలో పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మొదలై పలు కాలనీల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అమర వీరుల ప్రాణ త్యాగాలు మరువలేనివాని వారిని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వేముల అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరుముశ్ల పోశం, హర్ ఘర్ తిరంగా పట్టణ కన్వీనర్ కట్ట ఈశ్వర చార, కో కన్వీనర్ మాసు సత్యనారాయణ, 11వ వార్డు కౌన్సిలర్ గడ్డం సంపత్, సీనియర్ నాయకులు బంగారు వేణుగోపాల్, ఠాగూర్ ధన్ సింగ్, కుమ్మరి మల్లయ్య, దండు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.