తెలంగాణను భ్రష్టు పట్టించారు
Telangana has been corrupted
మాజీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి
ఋణమే తీసుకోలే మాఫీ ఎట్లాయే?
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య
నా తెలంగాణ, షాద్ నగర్: సుసంపన్న రాష్ర్టంగా ఉన్న తెలంగాణను పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించే విధంగా పరిపాలన కొనసాగిస్తోందని మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆరోపించారు. షాద్ నగర్ పట్టణంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన రైతు రుణమాఫీ ధర్నాకు మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు తెలంగాణ అంటే ఆత్మహత్యలు, సాగు, తాగునీటికి నోచుకోక, అవమానాలకు, అన్యాయాలకు గురైందన్నారు. అలాంటి తెలంగాణను బంగారు తెలంగాణగా టీఆర్ ఎస్ మార్చిందన్నారు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలు బేరీజు వేసుకోవాలని అన్నారు.
తనకు ఋణమాఫీ అయినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదంటే షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. సీఎం హామీలు నెరవేర్చాలంటే తనపై ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎమ్మెస్ నటరాజన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వి.నారాయణరెడ్డి, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ ఎంపీపీ వై. రవీందర్ యాదవ్, బిఆర్ఎస్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్,రాజ్యలక్ష్మి, లక్ష్మీనారాయణ గౌడ్,మురళీధర్ రెడ్డి,
తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి, యారం శేఖర్ రెడ్డి, భీష్మ రామకృష్ణ, కౌన్సిలర్ ఈగ వెంకట్రాంరెడ్డి, ప్రతాప్ రెడ్డి, కానుగు అనంతయ్య, జూపల్లి శంకర్, పిల్లిశేఖర్, మానస యాదగిరి, చెట్ల నర్సింలు, మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, రఘునాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.