పోటీకి దిగేందుకు ప్రియాంకకు భయం

ఆమె ఓటమి ఖాయం కేంద్రమంత్రి అర్జున్​ మేఘ్​ వాల్​

Apr 28, 2024 - 16:09
 0
పోటీకి దిగేందుకు ప్రియాంకకు భయం

జైపూర్​: రాయ్​ బరేలీ నుంచి రంగంలోకి దిగేందుకు ప్రియాంక గాంధీ వాద్రా భయపడుతున్నారని కేంద్రమంత్రి అర్జున్​ మేఘ్​ వాల్​ అన్నారు. కాంగ్రెస్​ పార్టీ కూడా ఆమె ఓటమి ఖాయమనే టిక్కెట్​ ను ఇంతవరకూ కేటాయించలేదన్నారు. ఆదివారం రాజస్థాన్​ లోని బికనీర్​ లో మీడియాతో అర్జున్​ మేఘ్​ వాల్​ మాట్లాడారు. యూపీలో కాంగ్రెస్​ పార్టీకి అభ్యర్థులే కరవయ్యారని పేర్కొన్నారు. రాహుల్​ గాంధేమో ఓటమి ఖాయమని గ్రహించే అమేథీని వదిలి పారిపోయారని విమర్శించారు. అందుకే దక్షిణ భారత్​ నుంచి ఆయన పోటీ చేయొచ్చని అన్నారు. దేశ ప్రజలకు ఈ ఇరువురు అసత్యాలు ప్రచారం చేస్తూ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీరిద్దరి పోటీపై ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీలోనూ భయం మొదలైందన్నారు. ఇద్దరి ఓటమి ఖాయమని మంత్రి అర్జున్​ మేఘ్​ వాల్​ స్పష్టం చేశారు.