- అన్ని రంగాల్లోనూ భాగస్వామ్యం కొనసాగించాలని నిర్ణయం
- సెమీ కండక్టర్ యూనిట్ ను పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ
సింగపూర్ సిటీ: భారత్–సింగపూర్ డిజిటల్ టెక్నాలజీ, సెమీ కండక్టర్, విద్య, వైద్యం, నైపుణ్యాల అభివృద్ధి అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. గురువారం నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గ, విదేశాంగ శాఖ బృందం సింగపూర్ పార్లమెంట్ హౌస్ లో ప్రధాని లారెన్స్ వాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ సమక్షంలో పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలపై అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇందులో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్-సెక్యూరిటీ, 5 జీ, సూపర్-కంప్యూటింగ్, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ డొమైన్‌లోని అప్‌స్కిల్లింగ్ వర్కర్లు ఉన్నాయి.
సెమీకండక్టర్ క్లస్టర్ డెవలప్‌మెంట్, టాలెంట్ కల్టివేషన్‌లో సహకారాన్ని సులభతరం చేస్తూ భారతదేశం-సింగపూర్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ కోసం రెండో ఎంఓయూ ద్వారా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుంది. గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్‌లో అంతర్భాగమైన సింగపూర్ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తితో ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా భారత్ లో సింగపూర్ సంస్థల సెమీ కండక్టర్ పరిశ్రమలు పెద్ద యెత్తున నెలకొల్పే అవకాశం ఉంది. దీంతో దేశంలో పెట్టుబడుల రాకతోపాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.
అదే సమయంలో ఆరోగ్యం, ఔషధం, ఉమ్మడి పరిశోధన, ఆవిష్కరణ, మానవ వనరుల అభివృద్ధి సహకారంపై దృష్టి సారించనున్నాయి. ఇరుదేశాల్లోని నైపుణ్య అభివృద్ధి, పరిశోధన, పరిష్కార మార్గాలను కలిసి వెతకనున్నాయి. సాంకేతికత, విద్యలో సహకారం పెంపొందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.
తొలుత ప్రధానమంత్రి మోదీ లారెన్స్ వాంగ్ సింగపూర్ లోని ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్ ను సందర్శించి అక్కడి సెమీ కండక్టర్ యూనిట్, తయారీని పరిశీలించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు ఇన్నోవేటర్ నిపుణులు, ప్రవాస భారతీయులతోనూ కలిశారు. సింగపూర్ మాజీ ప్రధానమంత్రి లీ హ్సీన్ లూంగ్‌ను కూడా ప్రధాని కలిసి సంతోషం వ్యక్తం చేశారు. మోదీ సింగపూర్ పర్యటన సెమీ కండక్టర్ పరిశ్రమలు భారత్ లో విస్తరించేందుకు భూముల లభ్యత ఉంది. ఆర్థిక వనరులను ఆయా సంస్థలే సమకూర్చుకోనున్నాయి.