కొత్త వంగడాలను విడుదల చేయనున్న ప్రధాని

109 రకాలు 61 పంటలు ఐఏఆర్​ ఐలో ఆదివారం విడుదల క్షేత్ర, ఉద్యాన పంటలకూ చోటు

Aug 10, 2024 - 18:34
 0
కొత్త వంగడాలను విడుదల చేయనున్న ప్రధాని

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అధిక దిగుబడినిచ్చే, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే  109 రకాల 61 పంటల కొత్త వంగడాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం విడుదల చేయనున్నట్లు ప్రధాని కార్యాలయంలో శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్​ఐ)లో విడుదల చేస్తారు. అనంతరం రైతులతో సంభాషించనున్నారు. ఈ పంటలో 27 ఉద్యాన పంటలు, 34 క్షేత్రస్థాయిలో పండించే పంటలకు చోటు లభించింది. 

క్షేత్ర పంటలు: మినుము, పశుగ్రాసం పంటలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు, చెరకు, పత్తి, ఫైబర్, ఇతర సంభావ్య పంటలతో సహా వివిధ తృణధాన్యాల విత్తనాలను విడుదల చేస్తారు.

ఉదాయన పంటలు: వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తోటల పంటలు, దుంప పంటలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, ఔషధ పంటలను విడుదల చేయనున్నారు. 

సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పులకు అనుకూలమైన పద్ధతులను అనుసరించే విధానాన్ని ప్రధాని ప్రోత్సహించనున్నారు.  ఈ పంటలను పాఠశాలలు, అంగన్​ వాడీలలో భాగస్వామ్యం చేస్తే పోషకాహార లోపం సమస్యలు కూడా తీరుతాయని వివరించనున్నారు. ఆయా పంటలు రైతులకు విస్తృత ప్రయోజనాలు, ఆదాయాన్ని అందిస్తాయని రైతులకు నూతన వంగడా పంటలపై అవగాహన కల్పించనున్నారు. దీంతో దేశంలో వ్యవసాయ రంగంలో నూతన అధ్యాయం దిశగా అడుగులు వేసేందుకు సిద్ధం కావాలని రైతులకు ప్రధాని మోదీ పిలుపునీయనున్నారు.