మెరుగైన పనితీరుపై శ్రద్ధ వహించాలి
బ్యాంకులకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సూచన ఆర్బీఐ ఉన్నతాధికారుల సమావేశం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బ్యాంకులు మరింత మెరుగైన పనితీరుపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రుణాల పెరుగుదల, డిపాజిట్లు నెమ్మదించడంపై దృష్టి సారించాలని అన్నారు. న్యూఢిల్లీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.
బ్యాంకింగ్ నియంత్రణ సవరణలను తీసుకువస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సవరణ చట్టం తీసుకురావడానికి అనేక కారణాలున్నాయన్నారు. బ్యాంకులు వినూత్నమైన, ఆకర్షణీయమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు అధిక రాబడులు పొందేందుకు మార్గాలను అన్వేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా స్టాక్ మార్కెట్ ల వైపు మళ్లుతున్నారని తెలిపారు. బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గడానికి ఇదీ ఒక ప్రధాన కారణమని తెలిపారు.
సహకార బ్యాంకింగ రంగంలో కొంతమేర పునర్నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే ఖాతాదారునికి అనుకూలంగా నామినేషన్ ను తీసుకువచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే క్లెయిమ్ విషయాల్లో కూడా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమని తెలిపారు.