మసీదులో ఘర్​ ఘర్​ మోడీ

వీడియోలు బయటకు బీజేపీ అభ్యర్థి అలోక్​ శర్మకు మద్దతు ప్రకటించిన ముస్లిం సమాజం

Apr 13, 2024 - 15:10
 0
మసీదులో ఘర్​ ఘర్​ మోడీ

భోపాల్​: భోపాల్​ లోని హైదరీ మసీదులో ‘హర్-హర్ మోడీ, ఘర్-ఘర్ మోడీ’ నినాదాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శనివారం ఈ వీడియోలు వెలుగులొకొచ్చాయి. అయితే శుక్రవారం మోదీ మధ్యప్రదేశ్​ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియోలు అదే సమయంలో తీసినవి కావడం విశేషం. బీజేపీ అభ్యర్థి అలోక్​ శర్మకు బోహ్రా కమ్యూనిటీ స్వాగతం పలికింది. ఈయనతోపాటు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. ఈ వీడియోలు కాస్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారాయి.

వీడియోలో ఏముంది?

వీడియోలో అలోక్​ శర్మకు మసీదులో ఘన స్వాగతం పలికారు. ఓ మహిళ ఆయనకు కండువా కప్పి స్వాగతించారు. అనంతరం ముస్లిం మతపెద్దలు ఆయనకు సాదర స్వాగతం పలికి ప్రసంగించారు. తాము అలోక్​ శర్మను కుటుంబ సభ్యుని మాదిరి భావిస్తామన్నారు. ఆయన నేతృత్వంలోని దేశ సంక్షేమం కోసం పాటుపడుతున్న మోదీని కూడా తమ కుటుంబ సభ్యులలో ఒకరిగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అబ్​ కీ బార్​ 400 పార్​, ఘర్​ ఘర్​ మోదీ అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.