ఆప్ ఢిల్లీకి ఆపద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Prime Minister Narendra Modi is a danger to AAP Delhi
యమునాను శుద్ధి చేయరా?
హాజరేను ముందుపెట్టి అవినీతికి పాల్పడతారా?
కేంద్ర పథకాలను అడ్డుకుంటున్నారు
వారికి అద్దాల మేడలు, ప్రజలకు అపరిశుభత్ర వాతావరణంలో ఇళ్లా?
రూ. 4500 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీకి ఆపద ఎవరో కాదని ఆప్, సీఎం కేజ్రీవాల్ అని, యమునా నదిని శుద్ధి చేస్తే ఓట్లు లభించవని కేజ్రీవాల్ అంటున్నారని, యమునాను అలాగే వదిలేస్తారా? అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. ప్రజలకు నీరు ఎలా అందిస్తారని నిలదీశారు. అన్నా హజారేను ముందుకు పెట్టి అవినీతికి పాల్పడే చర్యలకు తెరలేపారన్నారు. విద్య, వైద్యం, కాలుష్యం, మద్యంలోనూ అవినీతికి పాల్పడి ఢిల్లీని ఆపదలో నెట్టేశారని ఆప్ పై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని అశోక్ విహార్ లో నిరుపేదల కోసం నిర్మించిన ఇళ్లను ప్రారంభించి పరిశీలించారు. అనంతరం రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఢిల్లీ మార్పు కోసం ప్రతీ ఒక్కరూ ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు. నీరు అందించని సీఎం, మద్యం కుంభకోణానికి పాల్పడి పరువు పోగొట్టుకున్నారన్నారు.
కేంద్ర పథకాలన్నీ ఢిల్లీలో అమలు చేయాలని తాను భావిస్తుంటే ఇక్కడి ప్రభుత్వం ఆ పథకాలను అమలు చేయనీయడం లేదన్నారు. దీంతో ఈ ప్రాంతవాసులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ లాంటి బృహత్తర పథకంతో ప్రజలను దూరం ఉంచారన్నారు. దీంతో మోదీ కల నెరవేరడం లేదన్నారు.
అసత్య వాగ్ధానాలతో ఇక్కడి నాయకులు కాలం వెళ్లబుచ్చుతున్నారని, వారి కోసం అద్దాల మేడలు నిర్మించుకొని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఇళ్ల పథకాన్ని కూడా అటకెక్కించాలని చూస్తున్నారని ఆరోపించారు. పేదల ఇళ్లకోసం నీరు, స్వచ్ఛత, కాలువలు, డ్రైనేజీల నిర్మాణాల్లో కూడా అనేక అవాంతరాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అతిత్వరలో ఢిల్లీకి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. స్థానిక ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా తాము ఢిల్లీ ప్రజలకు మేలు చేకూరుస్తామన్నారు. ఇక్కడి ట్రాఫిక్ ను తగ్గించడంలో కూడా కేంద్రం పెద్ద యెత్తున చర్యలు తీసుకుంటుందన్నారు. బీజేపీ ఎంపీల విజ్ఞప్తి మేరకు అన్ని బైపాస్ లు, రోడ్లను విస్తరించి ట్రాఫిక్ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. ఎంపీల విజ్ఞప్తిని మోదీ ప్రభుత్వం అంగీకరించిందన్నారు.
2025 యేడాది ఢిల్లీ ప్రజలకు మేలు జరగాలంటే ఆపద సర్కార్ ను పక్కకు తప్పించి బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రాజెక్టుల ప్రారంభం..
ఢిల్లీలో రూ. 4500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అశోక్ విహార్ లో నిర్మించిన 1,675 గృహాలను ప్రారంభించారు. ఢిల్లీ యూనివర్సిటీలో రూ. 600 కోట్ల మూడు కొత్త ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇందులో నజఫ్‌గఢ్‌లోని రోషన్‌పురాలోని వీర్ సావర్కర్ కళాశాల భవనం కూడా ఉంది.